Saturday, November 23, 2024

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్‌ రోడ్డు కాలు పెట్టడానికి వీలులేకుండా భక్తులుతో నిండిపోయాయి. రూ.150 క్యూలైన్లు నిండి భక్తులు బయటకు బారులుదీరారు. ప్రసాద విక్రయశాల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. హోటల్, దుకాణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దర్శనానికి 6 నుంచి 7గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

కాగా భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎలాంటి వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దీంతో భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్‌రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్‌ చేశారు. కొండకింద పార్కింగ్, టెంపుల్‌ సిటీ ఘాట్‌రోడ్డు పూర్తిగా కార్లతో నిండిపోయింది. కొండ కింద చెక్‌పోస్టు వద్ద ఘాట్‌రోడ్డు ప్రారంభంలో ట్రాఫిక్ పోలీసులు తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement