సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బుధవారం కీలక ప్రకటన చేసింది. దాని పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థలు కలిసి.. లుండ్‌బెక్‌తో పేటెంట్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది. వొర్టిడిఫ్ బ్రాండ్ పేరుతో.. భారతదేశంలో వోర్టియోక్సేటైన్ సొంత వెర్షన్‌ను మార్కెటింగ్‌తో పాటు పంపిణీ చేయడానికి లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో మాత్రమే ఈ సేవలు అందించనుంది. వోర్టియోక్సేటైన్ అనేది.. మల్టి మోడల్ యాక్టివిటీతో కూడిన ఓ నావెల్ యాంటిడిప్రెసెంట్. ఇది పెద్దవారిలో మేజర్ డిప్రిసివ్ డిజార్డర్ (ఎండీడీ) చికిత్సకు ఉయోగిస్తారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాతో పాటు 80కు పైగా దేశాల్లో దీని ఉత్పత్తిని ఆమోదించబడింది. ఈ సందర్భంగా సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈఓ కీర్తి గనోర్కర్ మాట్లాడుతూ.. భారతదేశంలో న్యూరో సైకియాట్రీ థెరపీలో సన్ ఫార్మా అగ్రగామిగా ఉందన్నారు. వైద్య రంగానికి అవసరమైన సాయాన్ని అందించేందుకు ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఆ దిశగానే తాము ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఎండీడీ తీవ్రమైన సమస్య..
ఎండీడీ అనేది తీవ్రమైన, సంక్లిష్టమైన వ్యాధి అని, వొర్టిడిఫ్ భారతదేశంలోని రోగులకు చికిత్స అందించేందుకు ఓ ముఖ్యమైన మోడిసిన్‌గా ఉపయోగించడం జరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 246 మిలియన్‌ల మంది, భారత్‌లో 35 మిలియన్‌ల మంది ఎండీడీతో బాధపడుతున్నారని, 3 ఎండీడీ అనేది.. నిద్ర, ఆకలి, అలసట వంటి భిన్నమైన మానసిక సంబంధమైన మార్పులు కనిపిస్తాయని వివరించారు. ఎండీడీ తీవ్రత ఎక్కువ అయితే.. ఆత్మహత్య వరకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. భారతదేశంలోని న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్ట్ ల ప్రిస్క్రిప్షన్‌లో సన్‌ఫార్మా మందులు మొదటి స్థానంలో ఉందన్నారు. సన్ ఫార్మాకు చెందిన సీఎన్‌ఎస్ విభాగం.. దేశంలోని రోగులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు వినూత్న పరిష్కారాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..