Sunday, September 8, 2024

నట్టింట్లో నవ్వులు పంచనున్న స‌మ్మ‌ర్ సోగ్గాళ్లు.. ఓటీటీలో ఎఫ్3 రిలీజ్ ఎప్పుడంటే..

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్‌3 సినిమా థియేట‌ర్ల‌లో న‌వ్వుల పంట పండిస్తోంది. సినిమా హాళ్లోకి వెళ్లింది మొద‌లు.. బ‌య‌టికి వ‌చ్చేదాకా ఫుల్ ఫ‌న్ ఉంటుంద‌ని చెబుతున్నారు మూవీ ల‌వ‌ర్స్‌. అయితే ఈ సినిమా ఇప్పుడు ఇంటింటా న‌వ్వులు పూయించేందుకు రెడీగా ఉంది.. ప్ర‌తీ ఇంటికి వ‌చ్చే్స్తున్నారు స‌మ్మ‌ర్ సోగ్గాళ్లు.

వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన సినిమా ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా తెరకెక్కించారు. ‘ఎఫ్ 2’ సినిమాలో కనిపించిన తారలతో పాటు ‘ఎఫ్3స‌లో కొంత‌మంది కొత్త క్యారెక్టర్లు కనిపించాయి. పూజాహెగ్డే ఐటెం సాంగ్ కూడా చేసింది. మే 27న విడుదలై మాచం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిస్తోంది . కలెక్షన్స్ పరంగా వ‌సూళ్ల పంటా పండిస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ సినిమాలే రిలీజ్ అవ్వడం కూడా ‘ఎఫ్3’కి కలిసొచ్చింది. లాజిక్స్ లేని ఈ కామెడీ ఎంటర్టైనర్ ను బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన న్యూస్ ఒక‌టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది. సినిమా విడుదలైన 4 వారాల త‌ర్వాత‌ ఓటీటీలో రిలీజ్ చేసేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. దిల్ రాజు నిర్మాత కాబట్టి ఈ 4 వారాలు సినిమాను థియేటర్లో ఆడించుకోవడం ఖాయం. కాబట్టి జూన్ చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement