హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏప్రిల్ 12 నుంచి 20 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు ఇక ముగియడంతో ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ప్రకటిస్తారు. జూన్ 12న 2023-24 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం శుక్రవారం నుంచి వేసవి సెలవులను ముందస్తుగా ప్రకటించేశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement