పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు రెచ్చిపోతున్నారు. తాజాగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈరోజు జరిగిన ఎఫ్64 విభాగంలో జావెలిన్ త్రో ఫైనల్లో సుమీత్ అంటిల్ స్వర్ణం సాధించాడు. జావెలిన్ ను 70.59 మీటర్ల దూరం విసిరిన డిఫెండింగ్ ఛాంపియన్ సుమిత్ ఆంటిల్…. ఈ క్రమంలో సరికొత్త వరల్డ్ రికార్డు కూడా నమోదు చేశాడు.
విశేషమేమిటంటే… టొక్కో పారాలింపిక్స్‌లో 66.95 మీటర్లు జావెలిన్ విసిరి అతడు సృష్టించిన రికార్డును… ఈరోజు బద్దలు కొట్టాడు. కాగా, సుమిత్‌కు ఇది పారాలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం.
ఇక ఈ పోటీలో శ్రీలంకకు చెందిన దులన్ కొడితువాక్కు (67.03) రజతం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ బరియన్ (64.89) కాంస్యం సాధించాడు. ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 14కి చేరింది.