చంద్రయాన్-3 పరిశోధనల్లో మరో కొత్త విషయం వెల్లడైంది. చంద్రయానంలో వారం రోజులు పూర్తిచేసుకున్న వేళ ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి దక్షిణ ధ్రువం రహస్యాల అన్వేషణలో మరింత ముందుకు వెళ్లింది. చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని గుర్తించింది. ఇన్‌సిటీ కొలతల ద్వారా సల్ఫల్ జాడల్ని నిర్ధారించినట్లు ఇస్రో మంగళవారం తెలిపింది. రోవర్‌కు అమర్చిన అల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్ (ఎల్‌ఐబిఎస్) ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది.
తాజా నివేదికను బట్టి అల్యూమినియం, క్యాల్షియం, ఫెర్రస్ (ఐరన్), క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, హైడ్రోజన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక విశ్లేషణలు గ్రాఫికల్‌గా సూచించబడ్డాయి. తదుపరి కొలతల్లో మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ ఉనికిని వెల్లడించాయి. హైడ్రోజన్ కోసం అన్వేషణ జరుగుతోంది అని ఇస్రో తన ప్రకటనలో పేర్కొంది.
చంద్రుడిపై సల్ఫర్ అరుదైన మూలకం. దక్షిణ ధ్రువం ప్రాంతంలో దీని ఉనికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ీటి మంచు ఉనికికి సంకేతం కావొచ్చు. నీటి మంచు దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాశ్వతంగా నీడ ఉన్న క్రేటర్సేలో చిక్కుకున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఎల్‌ఐబిఎస్ అనే పరికరం పదార్థాల కూర్పులను విశ్లేషించే శాస్త్రీయ సాంకేతికత. అధిక శక్తి లేజర్ పల్స్ ఒక రాయి లేదా నేల ఉపరితలంపై కేంద్రీకృతం అవుతుంది. లేజర్ పల్స్ చాలా వేడితో కూడిన ప్లాస్మాను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాస్మా లైట్ వర్ణపటంగా పరిష్కరించ బడుతుంది. చార్జ్కపుల్డ్ పరికరాల వంటి డిటెక్టర్ల ద్వారా కనుగొనబడుతుంది. ప్రతి మూలకం ప్లాస్మా స్థితిలో ఉన్నప్పుడు కాంతి తరంగ దైర్ఘ్యాల లక్షణ సమూహాన్ని విడుదల చేస్తుంది. తద్వారా పదార్థ మౌలిక కూర్పు నిర్ధారణ అవుతుంది.