Monday, January 20, 2025

Suicide – యువ రైతు ప్రాణం తీసిన రుణం

మానవపాడు (ఆంధ్రప్రభ)అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

ఎస్సై చంద్రకాంత్ తెలిపిన వివరాల మేరకు…. మానవపాడు గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి (34)కి పంటలపై నష్టం వాటిల్లడంతో అప్పులు అధికమయ్యాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మనస్థాపం చెంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో గ్రామ శివారులో ఉన్న పంట పొలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

అటుగా ఉన్న రైతులు వెను వెంటనే మానవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శేఖర్ రెడ్డి మృతి చెందాడని వైద్యులు తెలపడంతో పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ మార్చురీకి తరలించామని ఎస్సై చంద్రకాంత్ తెలిపారు.

మృతుని భార్య హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అప్పులు అధికంగా ఉండడంతో ఎన్నోసార్లు మనస్థాపానికి గురయ్యావాడని, ఆ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునన్నారు. మృతునికి ఇద్దరు కూతుర్లు ఓ బాబు ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement