Wednesday, January 8, 2025

Suicide Bomber – పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి .. 47 మంది సైనికులు మృతి


30 మంది జ‌వానుల‌కు గాయాలు
ఆల‌స్యంగా వెలుగు చూసిన ఘ‌ట‌న‌
తామే దాడి చేశామ‌న్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ

ఇస్లామాబాద్ – పాకిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ ఘటనలో 47 మంది పాక్ సైనికులు మృతిచెందగా, 30 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ‘ఫిదాయీ సంగత్ బహర్ అలీ’గా గుర్తించారు. కాగా ఈ ఆత్మ‌హుతి దాడి శ‌నివారం జ‌ర‌గ‌గా నేడు పాక్ మీడియా వెల్ల‌డించింది.

- Advertisement -

ఒక బస్సు, ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసం

ఇక ఈ దాడికి పాల్పడిన బిఎల్ఎ ప్ర‌తినిధి వివ‌రాల‌ను మీడియాకు అందించారు. ‘‘తుర్బత్ నగరానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలోని బెహ్మన్ ఏరియాలో శనివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై మేం దాడి చేశాం. ఆ కాన్వాయ్‌లో మొత్తం 13 వాహనాలు ఉన్నాయి. వాటిలో 5 బస్సులు, 7 సైనిక వాహనాలు ఉన్నాయి. అవన్నీ కరాచీ నుంచి తుర్బత్ నగరంలో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వైపుగా వెళ్తుండగా ఈ దాడి చేశాం. దీంతో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమవగా, మిగతా బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో పాక్ ఆర్మీ కాన్వాయ్‌లో ఐంఐ 309 వింగ్, ఎఫ్‌సీ ఎస్ఐ‌యూ వింగ్, ఎఫ్‌సీ 117 వింగ్, ఎఫ్‌సీ 326 వింగ్‌లకు చెందిన సిబ్బందితో పాటు రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జోయబ్ మొహసిన్ (ప్రస్తుత పోలీసు అధికారి) ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement