రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త అలెగ్జాండర్ డుగిన్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగిన్ మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టాస్ పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం జరిగినట్లు తెలిపింది. అలెగ్జాండర్ డుగిన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దాడిలో ధ్వంసమైన కారు అలెగ్జాండర్ డుగిన్‌దని గుర్తించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి అలెగ్జాండర్ వాదన కూడా కారణమనే ఆరోపణలున్నాయి. అలెగ్జాండర్ కుమార్తె డార్యా రచయిత. ఉక్రెయిన్‌పై ఆమె రాసిన వ్యాసం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమె పేరును కూడా ట్రెజరీస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ ఆంక్షల జాబితాలో చేర్చారు.