ఆత్మాహుతి దాడిలో 10మంది సైనికులు మృతిచెందిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. ఆ తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 10మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడి చేసింది తామేనని హఫీజ్ గుల్ బహదూర్ సంస్థ, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ ప్రకటించుకున్నాయి. తమ సభ్యులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని భద్రతాదళాలు వెతకడంతో ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు తిరిగి అధికారాన్ని పొందిన తర్వాత… పాకిస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాల వద్ద హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి.
- Advertisement -