ఇటీవల కాలంలో భారత్ పై ఆన్ లైన్ పేమెంట్స్ సంస్థ నుండి పెద్ద సంఖ్యలో ఉన్నతస్థాయి ఉద్యోగులు వైదొలిగిన విషయం తెలిసిందే. కాగా ఈ సంస్థ సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామ చేశారు. దాంతో తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత సీఎఫ్‌ఓ నలిన్ నేగీని సంస్థ నియమించింది. సుహైల్ సమీర్ ఈ నెల 7 నుంచి భారత్‌పే వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరించనున్నారు.
భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానంలో 2022 మార్చిలో సుహైల్ సమీర్ నియమితులయ్యారు. తనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అష్నీర్ గ్రోవర్ కంపెనీకి రాజీనామా చేశారు. కంపెనీ సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేసినట్లు భారత్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సీఎఫ్‌ఓ నలిన్ నేగిని తాత్కాలిక సీఈఓగా నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. జనవరి 7 నుంచి సమీర్ కంపెనీకి స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా కొనసాగనున్నారు.