Thursday, November 21, 2024

విజయవంతంగా బేరియాట్రిక్‌ సర్జరీ, 200 కిలోల బరువున్న యువకుడికి చికిత్స

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చిన్నప్పటి నుంచే వయసుకు మించిన బరువు పెరుగుతూ ప్రాణాపాయ స్థితిలోకి చేరిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల అమన్‌ పొద్దర్‌కు హైదరాబాద్​లోని ప్రైవేట్​ హాస్పిటల్​ డాక్టర్లు ఆపరేషన్​ చేశారు. అతనికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. దాదాపు 200 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ఆ యువకునికి విజయవంతంగా బేరియాట్రిక్‌ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఉండాల్సిన బరువుకన్నా అధిక బరువుతో కూడిన స్థూలకాయం కారణంగా డయాబెటీస్‌, హైపర్‌ టెన్షన్‌, గుండె సంబంధిత వ్యాధులతో పాటూ కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలను అమన్‌ ఎదుర్కొన్నాడని వైద్యులు తెలిపారు.

వైద్యం కోసం అమన్‌ తల్లిదండ్రులు అస్సాం రాజధాని గౌహతితోపాటు కలకత్తాలలోని ప్రముఖ హాస్పిటల్స్‌ ను సంప్రదించారని గుర్తు చేశారు. అధిక బరువు కారణంగా అక్కడి వైద్యులు శస్త్ర చికిత్సకు ముందు రాలేదని, ఈ పరిస్థితుల్లో హైదరాబాదులోని ఆసుపత్రిలో అమన్‌ను చేర్చారని తెలిపారు. ఈ శస్త్ర చికిత్స వివరాలను ఆసుపత్రి కన్సల్టెంట్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డా. రాఘవేంద్ర రావు వెల్లడించారు. ఆసుపత్రిలో అత్యాధునిక లాపరోస్కోపిక్‌ శస్త్ర చికిత్సలు, ఎండోస్కోపీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం అమన్‌ కోలుకుంటున్నాడని, త్వరలోనే తన ఈడు యువకుల్లా సాధారణ జీవితాన్ని గడుపుతాడని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement