3500 కిలో మీటర్ల దూరంలోని టార్గెట్ ను చేధించిన మిసైల్
న్యూఢిల్లీ: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణు క్షిపణులు ప్రయోగించే సామార్ధ్యం ఉన్న ఐఎన్ఎస్ అరిహంత్ జలాంతర్గామి నుంచి ఆ క్షిపణిని ప్రయోగించారు. సుమారు 3500 కిలోమీటర్ల దూరం ీ మిస్సైల్ ప్రయాణించగలదు. ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ప్రయోగించిన ఈ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అంత దూరంలోని లక్ష్యాన్ని చేధించిందని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.. ఈ సబ్ మెరైన్ నుంచి కే-4 మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు..