హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఔషధ మొక్కల పెంపకంతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందొచ్చని జాతీయ ఔషధ మొక్కల బోర్డు పేర్కొంది. నాణ్యమైన ఆయుర్వేద, హె ర్బల్ మందుల తయారీకి ఔషధ మొక్కలకు ఎంతో డిమాండ్ ఉందని పేర్కొంది. బోర్డు కృషితో ఆయూష్ శాక సహకారంతో ఔషధ మొక్కలను పెంచిన రైతుల వద్దకు కొనుగోలు దారులు వెళ్లి మొక్కలను కొనుగోలు చేసేలా బోర్డు ప్రత్యేక ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది.
దక్షాణాది రాష్ట్రాల్లోని ఔషధ మొక్కల పెంపకందారులను, కొనుగోలుదారులతో కలిపేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఔషధ మొక్కలను పెంచుతున్న రైతులు 8289995600 నంబరుకు, కొనుగోలుదారులు 8289995600 నంబరులో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.