Saturday, November 23, 2024

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోలుకు స‌బ్సిడీ..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నానాటికి పెరుగుతుండటంతో వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి, కొనుగోలును ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ఆదాయపు పన్ను సెక్షన్‌ 80ఈఈబీ ప్రకారం రూ.1.50,000 పన్ను మినహాయింపును ప్రభుత్వం ప్రకటించింది. ద్విచక్రవాహనాలు, కార్లు కొనుగోలుకు ఈ మినహాయింపు వర్తించనుంది.

అయితే ఈ మినహాయింపు ఒక్కసారి మాత్రమే పొందేవీలుంటుంది. ఇంతకుముందు ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనుగోలు చేయనివారు మొదటిసారి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఈ పథకం ప్రకారం మినహాయింపు పొందవచ్చు. ఇప్పటికే లోన్‌పై ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనుగోలుచేసినవారు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణంపై వడ్డీకి పన్ను మినహాయింపును క్లైయిమ్‌ చేయవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement