Thursday, November 21, 2024

Spl Story: సబ్​స్క్రైబర్స్​ సైన్​ అవుట్​.. పెయిడ్​ మెంబర్స్​ని కాపాడుకునేందు నెట్​ఫ్లిక్స్​ ఛీప్​​ ట్రిక్స్​!

ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ యాప్​ నెట్​ఫ్లిక్స్ ఇండియాలో పెద్ద ఎత్తున సబ్​స్క్రైబర్స్​ని కోల్పోతోంది. ఇప్పటికే దాదాపు లక్షలాది మంది ఆ యాప్​ నుంచి దూరమయ్యారు. దీంతో దాని నిర్వాహకులు కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు కొత్త సబ్​స్క్రైబర్స్​ వస్తారా? లేక మరింత మంది దూరమవుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ​

ఈ మధ్య కాలంలో వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్– సీజన్ 4 వాల్యూమ్–1 మే 27న విడుదల కాగా, ఇది వ్యూయర్స్​ని బాగానే ఆకట్టుకుంది.. అయితే అదే సీజన్‌కు చెందిన 2వ వాల్యూమ్ జూలై 1న విడుదల చేశారు​. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఒక సీజన్‌ను 2 భాగాలుగా ఎందుకు రిలీజ్​ చేసింది? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇట్లానే మనీ హీస్ట్ సీజన్ 5 వాల్యూమ్ 2 డిసెంబర్ 2021లో విడుదలైతే… అదే సీజన్‌లోని వాల్యూమ్ 1 సెప్టెంబర్‌లో విడుదలైంది. దీన్నిబట్టి నెట్​ఫ్లిక్స్​ తన సబ్​స్క్రైబర్స్​ని నిలబెట్టుకునేందుకు ఇట్లాంటి ట్రిక్స్​ ప్లే చేస్తున్నట్టు అనలిస్టులు పేర్కొంటున్నారు.

ఇన్ని చేసినా .. 2022 మొదటి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిందని, తర్వాతి మూడు నెలల్లో మరో 20 లక్షల మందిని కోల్పోతుందని అంచనా వేస్తున్న వార్తలకు ఇది పెద్ద ఉదాహరణగా నిలుస్తుందని చెబుతున్నారు. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ దాని ప్రసిద్ధ కొరియన్ టెలివిజన్ సిరీస్ స్క్విడ్ గేమ్, దాని ముఖ్యమైన రెండు మూవీస్​ అయిన డోంట్ లుక్ అప్,.. రెడ్ నోటీసుతో మాంచి వ్యూయర్స్​ని రాబట్టుకుంది. ఆ విజయానికి కృతజ్ఞతలు తెలుపుతూ దాని ప్రపంచ సభ్యుల సంఖ్యను 8.3 మిలియన్లకు పెంచుకుంది.

ఏదేమైనా, ప్రపంచవ్యాప్తంగా 222 మిలియన్ల చెల్లింపు వినియోగదారులను కలిగి ఉన్న ఏకైక స్ట్రీమింగ్​ సర్వీస్​గా నెట్​ఫ్లిక్స్​ పేరుగాంచింది. అయితే.. 2020లో 37 మిలియన్ల నుండి 2021లో 18 మిలియన్లకు దాని సబ్​స్క్రైబర్స్​ పడిపోయారు. అంటే దాదాపు 50% కంటే ఎక్కువగా సబ్​స్క్రైబర్స్​ తగ్గినట్టు తెలుస్తోంది.  నెట్‌ఫ్లిక్స్ తెలిపిన ఓ నివేదక ప్రకారం.. ఈ ప్లాట్‌ఫారమ్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 2.6 మిలియన్ల పెయిడ్​ సబ్​స్క్రైబర్స్​ని రాబట్టుకుంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 2  మిలియన్ల నుండి పైకి చేరింది. వీటిలో ఎక్కువ భాగం ఇప్పటికీ COVID-19 ఫలితంగా అంతరాయాన్ని ఎదుర్కొంటున్న మాట నిజమే.

ఇక.. జపాన్, భారతదేశం ఈ రెండు దేశాల్లోనే వేగంగా విస్తరించిందనే చెప్పవచ్చు. ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 మొత్తాన్ని వెంటనే చూడాలనుకుంటే.. కనీసం 2 నెలల పాటు Netflix సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేయాలి. అయితే.. వారం వారం ఒక ఎపిసోడ్‌ను విడుదల చేసే దాని పోటీదారుల మాదిరిగా కాకుండా నెట్‌ఫ్లిక్స్ సాధారణంగా మొత్తం ఎపిసోడ్స్​ని ఒకేసారి విడుదల చేస్తుంది. అయినా ఏప్రిల్ చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ కు సభ్యత్వం పొందిన 23% మంది అమెరికన్లు తమ సభ్యత్వాలను రద్దు చేసుకోవడం గమనించవచ్చు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement