కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.భారీవర్షాల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాలో రూ.10.36 కోట్లతో 27 రహదారుల మరమ్మత్తులకు ప్రతిపాదించినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి బొత్స సత్యనారాయణ..రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయడం లేదు.. జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా పాఠశాలల విలీనం మాత్రమే చేస్తున్నామని స్పష్టీకరించిన మంత్రి..సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను 3వ తరగతి నుంచే నియమిస్తున్నామని వెల్లడి..రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్ధులకు 5 లక్షల ట్యాబ్‌లు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపిన మంత్రి..
నాడు – నేడు ఫేజ్ -1 పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు..పూర్వ ప్రాధమిక పాఠశాలల్లో అంగన్ వాడీ కార్యకర్తతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తున్నాం.. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు చేస్తున్నాం, కెజిబివి లు వున్న చోట కళాశాలల్ని వేరే చోటుకు తరలించే ఆలోచన చేస్తున్నాంః మంత్రి బొత్స.. అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకే జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ప్రారంభించాం, 200లోపు ర్యాంకింగ్ వున్న సంస్థల విషయంలో అవసరమైతే పెంచే విషయం ఆలోచిస్తాం..ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రకారమే బోధన జరగాలన్నారు మంత్రి.