Friday, November 22, 2024

సత్యమూర్తి సేఫ్, 48 గంటల ఉత్కంఠకు తెర.. వారణాసిలో సత్యమూర్తి, పిల్లలు క్షేమం!

తాండూరు, (ప్రభన్యూస్): 48 గంటల్లో భార్య అదృశ్యం కేసును చేధించాలని పోలీసుకు గడువు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సత్యమూర్తి సంఘటనలో ఉత్కంఠకు తెరపడింది. పిల్లలతో కలిసి అదృశ్యమైన సత్యమూర్తి ఆచూకీని పోలీసులు చాకచక్యంగా గుర్తించడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే గత మూడు నెలల క్రితం తన భార్య అన్నపూర్ణ(36) అదృశ్యమైతే పోలీసులు కేసును చేధించడం లేదని మనస్థాపం చెందిన సత్యమూర్తి ఆవేధనతో అతని పిల్లలతో కలిసి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇందులో పోలీసులకు 48 గంటల గడువు ఇచ్చి కేసును పరిష్కరించక పోతే ఆత్మహత్య చేసుకుంటామని, మృతదేహాల లోకేషన్ షేర్ చేస్తామని చెప్పడంతో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రంలో సంచలనంగా మారింది. వికారాబాద్ జిల్లా ఎస్సీ నంద్యాల కోటిరెడ్డి, తాండూరు డీఎస్సీ జి.శేఖర్ గౌడ్ ప్రత్యేక చొరవతో వారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారు జాము నుంచి సత్యమూర్తి శంషాబాద్ నుంచి ముంబయ్, అక్కడి నుంచి వారణాసి… కాశీ వెళ్లినట్లు గుర్తించారు.

రెండు రోజుల పాటు శ్రమించి ఎట్టకేటలకు వారణాసిలోని ఓ లాడ్జిలో సత్యమూర్తి, అతని కూతుళ్లు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలిసిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, తాండూరు డీఎస్పీ కోటిరెడ్డి సత్యమూర్తి క్షేమ సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. వారణాసి నుంచి వారిని క్షేమంగా తీసుకరావడం జరుగుతుందని మీడియాకు ప్రకటించారు. 48 గంటలు ఎంతో ఉత్కంఠతకు గురిచేసిన ఈ సంఘటనలోపాటు పోలీసు అధికారులు, ప్రజలు సత్యమూర్తి. పిల్లలు క్షేమ సమాచారం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఇంట్లో ఫోన్లు, పెన్ డ్రైవ్ల స్వాధీనం
మరోవైపు 48 గంటల ముందు సెల్ఫీ వీడియోలో సత్యమూర్తి వెల్లడించిన వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారణాసిలో సత్యమూర్తి క్షేమంగా ఉన్నారని సమాచారం తెలిసిన వెంటనే పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ పట్టణంలోని సత్యమూర్తి నివాసానికి చేరుకున్నారు. సత్యమూర్తి సోదరుల సమక్షంలో నివాసాన్ని తెరిచారు. సెల్పీ వీడియోలో వెల్లడించిన విధంగా దాదాపు 5 సెల్ఫోన్లు, 10 పెన్ డ్రైవ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అనుమానం ఉన్న వారి పేర్లను రాసిన లె ఖలను కూడ స్వాదీనం చేసుకున్నారు. మరోవైపు సత్యమూర్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అన్నపూర్ణ అదృశ్యం కేసును త్వరగా చేధించాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement