కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీంతో విద్యార్థులు అంతా కూడా హాస్టల్స్ ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో వారు ఆందోళన బాట పట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్స్ మూసివేతకు నిరసనగా రోడ్డెక్కారు. కొరోనా నిబంధనలు పాటిస్తామని హాస్టల్స్ మాత్రం మూయటానికి వీలు లేదని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్ లో కూడా విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించారు. హాస్టల్స్ మూయటానికి వీలు లేదంటూ నినాదాలు చేశారు. ఇక విద్యార్థులు రోడ్డుపై బైఠాయించటంతో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.