హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ ఫలితాల కోసం 9.47 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎదురు చూసు ్తన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు ముగిసిన కేవలం 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తే తెలంగాణలో మా త్రం ఫలితాలను వెలువరించడంలో సమయం ఎక్కు వగా తీసుకుంటున్నారు. తెలంగాణ, ఏపీలోనూ ఇంట ర్ పరీక్షలు మార్చి 15 ప్రారంభమై ఏప్రిల్ 4తోనే ముగి శాయి. అయితే ఏపీలో అతి తక్కువ రోజుల్లోనే ఇంటర్ జవాబు పత్రాలను మూల్యాంకనం, ఇతర ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను వెలువరించారు. కానీ తెలంగా ణలో మాత్రం ఫలితాలు వెల్లడికి సంబంధించి కచ్చి తమైన సమాచారం లేదు. పైగా మూల్యాంకనం ప్రక్రి య కూడా ఏపీ కంటే తెలంగాణలోనే ముందుగా ప్రా రంభమైంది.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.47 లక్షల మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం 4,82,619 మంది, ద్వితీ య సంవత్సవరం పరీక్షలకు 4,65,022 మంది విద్యా ర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం మూల్యాకనం, ఇతర ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే ఏపీలో కొద్ది రోజుల్లోనే సాధ్యమైన ఫలితాల విడుదల…తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులకు అది ఎందుకు సాధ్య మవ్వడంలేదోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తు న్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగానే ఫలితాలను వెలువరించాలని ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఎంసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల దృష్ట్యా వీలై నంత త్వరగా మూల్యాంకనం తుది ప్రక్రియను పూర్తి చేసి అన్నీ కుదిరితే ఈ వారంలోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారంలోపు ఎప్పుడైనా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఓవైపు ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తునే ఎంసెట్, నీట్, జేఈఈ ఇతర ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పాస్, ఫెయిల్ తెలియకపోవడంతో ఉన్నత చవదువుల కోసం రాసే ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలన్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, టెన్త్ హిందీ పేపర్ లీకేజీల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనికి తోడూ గత ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్ల వల్ల దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ఈసారి ఫలితాల విడుదల్లో ఎలాంటి పొరపాట్లు జరగ కుండా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుం టు న్నారు. ఒకటికి రెండు సార్లు మార్కుల విషయంలో క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం ఇది కావడంతో జరగరాని పొరపాట్లు ఒకవేళ ఏమైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. ఈక్రమంలోనే ఫలితాల విష యంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తు న్నారు.