Tuesday, November 26, 2024

నో సిగ్నల్….చెట్లెక్కిన విద్యార్థులు

కరోన మహమ్మారి కారణంగా స్కూల్స్ మూతపడ్డాయి. దీనితో విద్యార్థులు ఆన్ లైన్ క్లాస్ లకే పరిమితం అయ్యారు. అయితే ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో విద్యార్ధులు నెట్ (టవర్) లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెట్ల పైకి, వాటర్ ట్యాంక్ ల పైకి ఎక్కి క్లాస్ లు వింటున్నారు.

వివరాల్లోకి వెళ్తే…నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని మారుమూల గ్రామాలైన చెన్నంపల్లి, పద్మన్నపల్లి గ్రామాలలో నెట్ లేక ఆన్ లైన్ విద్యతో సతమతమవుతున్న విద్యార్థులు,రోజురోజుకు చదువులకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టవర్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు. తమ పిల్లల పైనుండి ఎక్కడ కిందపడి పోతారేమోనని భయాందోళనతో కుటుంబ సభ్యులు బిక్కు బిక్కు మంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement