Friday, November 22, 2024

అమెరికా వెళ్లాలనుకునేవారికి ముఖ్య గమనిక

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులను ఆగస్టు 1వ తేదీ తరువాతే తమ దేశంలోకి అనుమతిస్తామని హైదరాబాద్‌ కాన్సులేట్‌ తెలిపింది. మంగళవారం ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్‌ కట్టడికి అమెరికా అధ్యక్షుడు విధించిన నిబంధనలు అమలులో ఉన్న కారణంగా విదేశీ విద్యార్థులందరికీ ఆగస్టు 1 తరువాత మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థి వీసా (ఎఫ్‌)లు పొందినప్పటికీ ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు ఉండటంతో వారిని దేశంలోకి అనుమతించలేమని వివరించింది. భారత్‌తోపాటు చైనా, ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విద్యార్థులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయంది. ఆగస్టు 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ అమెరికన్‌ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం లేదంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement