Wednesday, November 20, 2024

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య బాధాకరం : సర్దార్ వినోద్ కుమార్

నిత్యం విద్యార్థుల ఆత్మహత్యలకు బాసర ట్రిపుల్ ఐటీ కేరాఫ్ గా మారిందని ఇదే సంవత్సర కాలంలో సంజయ్, రాథోడ్ సురేష్, నేడు భాను ప్రసాద్ వరకు బంగారు భవిష్యత్తు కోసం యూనివర్సిటీకి వచ్చి ఎదుగుతారు అనుకుంటే మధ్య‌లోనే KCR ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, యూనివర్శిటీ అధికారుల అలసత్వం, నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇలాంటివి దూరదృష్ట ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, (TJS) ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్ ఆరోపించారు. యూనివర్సిటీ వ్యవస్తీ కృత లోపాలను గుర్తించి సరి చేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, నిర్లక్ష్యం మానుకోవడo లేదనీ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ లోపాలు కూడా ఇందులో భాగం అని ఆరోపించారు.
“బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలన్ని KCR ప్రభుత్వ హత్యలే” అని పేర్కొన్నారు. భాను ప్రసాద్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement