పెద్దమందడి, (ప్రభన్యూస్) : పదవ తరగతి పరీక్షల్లో ఒక సబ్జెక్టులో రెండు మార్కుల తేడాతో ఫెయిలయ్యాననే బాధతో మనస్థాపానికి గురై క్షణికావేశంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు పెద్దమందడి మండలం మనిగిళ్ళ గ్రామానికి చెందిన వడ్డే పార్వతమ్మ ఉషన్నల కూతురు సంధ్య అదే గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాసింది. గురువారం పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడగానే మ్యాథమెటిక్స్ లో 2 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయింది.
దీంతో తీవ్ర ఆవేదన చెందిన సంధ్య క్షణికావేశంతో తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. సంధ్య ఆత్మహత్య ఉదాంతం సోషల్ మీడియాలో అర్థగంట సమయంలోనే పెద్దమందడి మండలంలోనే కాకుండా వనపర్తి జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడిన సంధ్య తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. అలాగే ఆమె బంధుమిత్రులు ఇతర ఉపాధ్యాయ వర్గాలు ప్రజా ప్రతినిధులు సంధ్యకు తమ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చి కుటుబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.