దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి (18) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఈ ఘటనపై శ్రావణి తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా.. మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. దీంతో శ్రావణి కుటుంబ సభ్యులు కాలేజీలో ఏం జరిగిందో చెప్పాలని, తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కాలేజీ ఆవరణలో ఆందోళన చేపట్టారు.
దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. శ్రావణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.