Tuesday, November 19, 2024

టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. బెంగళూరులో ఘటన

ఇద్దరు టీచర్ల వేధింపులకు సారా అనే 16 ఏళ్ళ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు రూరల్‌ జిల్లాలో పార్వతిపురాలో ఉంటున్న సారా మిలేనియమ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకుంటోందని పోలీసులు శుక్రవారం తెలిపారు. జూన్‌ 20న తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇంటికి చేరుకుందని, ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకుంది. తలుపు ఎంత తట్టినప్పటికీ తీయకపోవడంతో తల్లిదండ్రులు తలుపును పగులకొట్టి లోపలకు వెళ్ళి చూడగా ఫ్యాన్‌ ఉరివేసుకొని సారా కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్దారించారు.

తమ కుమార్తె ఆత్మహత్యకు స్కూల్‌లో పనిచేసే ఇద్దరు టీచర్లు నళినా, ఖమర్‌ తాజ్‌ కారణమని పేర్కొంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సారా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు ఇద్దరు టీచర్లు మిగిలిన పిల్లల ముందు ఆమెతో 100 గుంజిళ్లు తీయించారు. ఖమర్‌ తాజ్‌ కుమారుడు హమీన్‌ తనతో సంబంధం పెట్టుకోవాలని, తనను పెళ్ళి చేసుకోవాలని సారాను వేధించేవాడు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించడంతో టీచర్‌ ఖమర్‌ తాజ్‌ అదృశ్యమైపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన టీచర్లను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement