Friday, November 22, 2024

మనుషులే మీద పడిన పిడుగు.. కానీ బతికి బయట పడ్డారు

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొన్ని వేల వోల్టుల శక్తి ఉన్న పిడుగు మీదొచ్చి పడితే.. ఉన్న ప్రాణం ఉన్న చోటునే పోతుంది. ఓ నలుగురు తోటమాలులకూ ఇదే పరిస్థితి ఎదురైంది. గురుగ్రామ్ సెక్టార్ 82లోని వాటికా సిగ్నేచర్ విల్లాస్‌లో ఈ ఘటన జరిగింది.

శుక్రవారం దేశ రాజధానిలో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో వర్షం పడుతోందని భావించిన సదరు విల్లాస్‌లో పనిచేసే ఆ నలుగురు తోటమాలులు ఓ చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. వాళ్లు వెళ్లి అలా నిలబడ్డారో లేదో.. కాసేపటికే ఆ చెట్టుపై ఉన్నట్టుండి పిడుగు పడింది. నలుగురు వ్యక్తులు ఉన్న చోటనే కుప్పకూలిపోయారు. అదృష్టం కొద్దీ వారు బతికే ఉండడంతో మనేసర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురికి ప్రాణాపాయం తప్పగా.. ఓ వ్యక్తి పరిస్థితి మాత్రం విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement