Tuesday, November 26, 2024

Earthquake: మూడు దేశాలను వణికించిన భూకంపాలు

ఈశాన్యప్రాంతంలోఈ రోజు తెల్లవారు జామున జంట భూకంపాలు సంభవించాయి. భారత్ సహా రెండు దేశాలను వణికించాయి. వాటి తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ మూడు దేశాల సరిహద్దుల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపాల వల్ల కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అందుతోన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లు తెలియరావట్లేదు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అధికారులు పేర్కొన్నారు.

తొలుత బంగ్లాదేశ్‌లోని సరిహద్దుల్లోని చిట్టాగాంగ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. చిట్టాగాంగ్ సిటీ.. భారత్-మయన్మార్ సరిహద్దు రీజియన్ పరిధిలోకి వస్తుంది. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉంటుంది. ఫలితంగా సునామీ ఆందోళనలు మొదట్లో వెలువడ్డాయి. సునామీ రావడానికి అవకాశం లేదంటూ యూరోపియన్ మిడ్‌టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. సునామీ సంభవించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement