గ్రూప్ 2 పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా.. ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. కాగా, తాజాగా ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాత్తంగా 1,368 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు టీజీఎస్పీఎస్సీ తెలిపింది.
ఈ నెల 9 (సోమవారం) నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తుండగా, అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30గంటల మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు.