ఎన్‌టీపీసీ, (ప్రభన్యూస్): ట్రాఫిక్ నియమ నిబంధనలను పకడ్భంధిగా అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సీపీ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టషన్ లో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు ట్రాఫిక్ అధికారులకు, సిబ్బంది పలు సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే కమిషనరేట్ పరిధిలో వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకునేలా సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహజన్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, ఖని ఏసీపీ గిరి ప్రసాద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ట్రాఫిక్ ఎస్‌ఐలు కమలాకర్, నాగరాజ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..