Monday, November 25, 2024

తెగిన ‘ఆధారం’.. చిన్న పొరపాటు జరిగిన ఎన్​రోల్​ సెంటర్​ మూసివేత!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో యూఐడిఏఐ తీసుకు న్న కఠిన నిర్ణయాలతో చిన్నచిన్న తప్పులు చేసినా ఆధార్‌ కేంద్రాలను వెంటనే రద్దు చేస్తోంది. అర్హత లేని వారికి ఆధార్‌ కార్డులను జారీ చేయడం..కార్డుల జారీకి కావాల్సిన పత్రాలను సమర్పిం చడంతో తప్పులు చేయడం.. ఆధార్‌ కార్డు దరఖాస్తు భర్తీలో పొరపాట్లు దొర్ల డంను యూఐడిఏఐ తీవ్రంగా పరిగణిస్తోంది. వెంటనే లైసెన్సు పొందిన ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేస్తోంది. దీంతో అక్కడి ఆధార్‌ కేంద్రం మూతపడుతోంది. వివిధ కారణాలతో యూఐ డిఏఐ ప్రైవేటులో ఆధార్‌ కేంద్రాలను అనుమతించడం లేదు. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలలో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తోంది. ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరీక్షలు నిర్వహించి మరీ ఆధార్‌ కేంద్రాలలో నియమిస్తోంది.

ఆధార్‌ కేంద్రాలలో ఉండే ఆపరే టర్ల వేలిముద్ర ఆధారంగానే కొత్త కార్డుల జారీ.. పాత వాటిలో మార్పుల కు అవకాశం ఉంటుంది. పొరపాటు చేసే ఆపరేటర్ల వేలి ముద్రలను యూఐ డిఏఐ సస్పెండ్‌ చేయడంతో మొత్తంగా ఆధార్‌ కేంద్రంలో సేవలు నిలిచిపోతు న్నాయి. జిల్లాలోని తాండూరు ప్రాంతంలో ఆధార్‌ కార్జుల జారీతో పాటు మార్పులకు మునిసిపల్‌ కార్యాలయంలో ఆధార్‌ కేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోని ఆపరేటర్‌ చేసిన చిన్నచిన్న తప్పులపై యూఐడి ఏఐ తీవ్రంగా స్పందించింది. సేవలను నిలిపి వేసింది. గత నాలుగు మాసాలుగా మునిసి పాలిటీలోని ఆధార్‌ కేంద్రం మూతపడింది.

ఇక తపాలా కార్యాల యంలో ఉన్న కేంద్రంలోని ఆపరేటర్‌ వివిధ కారణాలతొ సెలవులో ఉన్నారు. అక్కడా సేవలు లభించడంలేదు. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉన్నా అక్కడ సాధారణ ప్రజలకు సేవలు లభించడం లేదు. గతంలో మునిసిపల్‌ కార్యాలయంలో ఆధార్‌ కేంద్రం ఉండగా ప్రతిరోజు 50 వరకు పాత ఆధార్‌ కార్డులో మార్పులకు దరఖాస్తులు వచ్చేవి. ఇక కొత్త కార్డుల కొరకు మరో 25 వరకు దరఖాస్తులు వచ్చేవి. మొత్తంగా ప్రతిరోజు 75 దరఖాస్తులు ఆధార్‌ కేంద్రంకు వచ్చేవి. గత నాలుగు నెలలుగా ఆధార్‌ కేంద్రంలో సేవలు నిలిచిపోవడంతో తాండూరు ప్రాంత ప్రజలు వికారాబాద్‌కు లేదా కోడంగల్‌కు పయనం అవుతున్నారు.

తాండూరు ప్రాంతంలోని బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కూడా ఆధార్‌ కేంద్రం ఉన్నా ప్రజలు ఎక్కువగా వికారాబాద్‌కు వెళుతున్నారు. తాండూరులోని తహసీల్దార్‌ కార్యాలయంకు కూడా ఆధార్‌ కేంద్రం మంజూరైంది. అయితే ఇప్పటి వరకు దీనిని ఏర్పాటు చేయలేదు. మునిసిపల్‌ కార్యాలయంలోని ఆధార్‌ కేంద్రంను తిరిగి పునరుద్ధరిం చేందుకు సమయం తీసుకునే అవకాశం ఉంది. తాండూరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఆధార్‌ ఇబ్బందులను దూరం చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే తాండూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ఆధార్‌ కేంద్రంను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement