పామర్రు, ఆంధ్రపభ్ర (కృష్ణాజిల్లా) : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేన నరేష్, అధికారులతో కలిసి ఇవాళ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వరికుప్పలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఒక బస్తాకు ఐదు కిలోలు మించి తరుగు మినహాయిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అలా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ… రైతులకు వారి ఖాతాల్లో పంట డబ్బులు వెంటనే జమ అయ్యేటట్లు చూడాలని మంత్రిని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.