Tuesday, November 26, 2024

Central Warning : డీప్ ఫేక్ వీడియోలు వైర‌ల్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ….సోష‌ల్ మీడియాకు కేంద్రం వార్నింగ్

న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్‌ ఫేక్‌ వీడియోలపై కేంద్రం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్‌ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. డీప్‌ఫేక్‌ల సమస్యపై చర్చించేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో నిర్వహించిన సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్,ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన జ‌రిగింది.

డీప్‌ఫేక్ సమాజంలో కొత్త ముప్పుగా మారిందని వైష్ణవ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా డీప్‌ఫేక్‌లు ఉద్భవించాయన్నారు. వీటిన సృష్టించి, వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. డీప్‌ఫేక్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటి నియంత్రణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. అంతేకాదు సంఘవిద్రోహ శక్తులు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. రానున్న పదిరోజుల్లోనే నిబంధనల ముసాయిదాను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్‌లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్‌ డీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకురానున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement