హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని, ఈ నెల 22నాటికి అది మరింతగా బలపడి వాయిగుండంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. వాయిగుండం ప్రభావంతో శుక్ర, శని వారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ తర్వాత తుఫాన్‌గా బలపడనుందని పేర్కొంది.
దీని ప్రభావంతో నల్గొండ, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్ధిపేట, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.