టేకుమట్ల, (ప్రభ న్యూస్): మొన్నటిదాకా వరుసగా వచ్చిన వానలు పంటలను దెబ్బతీస్తే.. ఇప్పుడు మిర్చి తోటలను వింత వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ సీజన్ లో అధిక వర్షాల ప్రభావంతో ఇతర పంటలకు నష్టం కలిగిన నేపథ్యంలో మిరప తోటల తోనైనా నష్టాలు పూడ్చుకోవచ్చన ఆశలో రైతులున్నారు. కానీ, వైరస్ సోకి పంటలు దెబ్బతినడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వేసిన మిర్చి తోటలో కళ్లెదుటే వైరస్ సోకి ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులన్నారు. ఈ వైరస్ ప్రభావం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మిల్లపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా ఉంది. మిరప పువ్వు పై తామర పురుగులు చేరి పంట నాశనం చేస్తున్నాయి. ఎన్ని మందులు పిచికారి చేసినా ఫలితం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital