Friday, November 22, 2024

Mystery : జ‌ప‌నీస్ ద్వీపంలో వింత మ‌మ్మీ.. మ‌త్స్య‌క‌న్య‌గా చెబుతున్న శాస్త్రవేత్త‌లు

‘మత్స్యకన్య’ ఆకారంలో ఉన్న 300 ఏళ్ల మమ్మీని ప్రస్తుతం జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. దాని అసలు స్వభావాన్ని కనుగొనడానికి ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. దాని లక్షణాలను చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. 1736 – 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడింది. ఈ మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖతో పాటు ఒక పెట్టెలో భద్రపరచి ఉన్నట్లు క‌నుగొన్నారు.

కానీ, ఇప్పుడు అది అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉంది. మమ్మీకి కోణాల దంతాలు, ముఖం, రెండు చేతులు, తల, నుదురుపై వెంట్రుకలు ఉన్నాయి. సంక్షిప్తంగా, దాని రూపాన్ని ఎగువ భాగంలో వింత మానవుడు. కానీ, దిగువ భాగంలో ఇది చేపల లక్షణాలను కలిగి ఉంది. శరీరం యొక్క దిగువ భాగంలో పొలుసులు, తోకవంటి టేపర్డ్ ఎండ్ ఉంది. దాని రహస్యాలను బట్టబయలు చేయడానికి కురాషికి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు ఇప్పుడు CT స్కానింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వపు పురాణం(యావో-బికుని) ఉందని, మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమా ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత చెబుతున్నారు. ఈ పురాణం కుడా ఆ మత్య్స కన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు. ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్య్స కన్య పొలుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు. ఆ మత్స్య కన్యలు అంటు వ్యాధులను దూరం చేస్తాయని జపాన్‌ వాసుల ప్రగాఢ నమ్మకం అని కూడా చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement