వనపర్తి జిల్లాలోని వెంకటాపూర్ గ్రామం జక్కంపల్లి శివారులో చిరుతను పోలిన వింత జంతువు సంచరిస్తోంది. దీంతో దాని కదలికలను కొందరు యువకులు సెల్‌ఫోన్‌లలో బంధించారు. జక్కంపల్లి శివారులోని పంట పొలాల్లో ఈ జంతువు సంచరించినట్లు వారు చెప్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆ జంతువు చిరుత లేదా మరేదైనా క్రూర మృగమా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అయితే సదరు జంతువు సంచారం పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వనపర్తి ఫారెస్ట్ రేంజర్ వాణికుమారి తెలిపారు. చిన్న చిన్న అడవులలో సంచరించే జంతువుల జాతికి చెందిన పునుగుపిల్లిగా ఆ జంతువును తాము గుర్తించామని వివరించారు. ఈ జంతువు ద్వారా ఎలాంటి ప్రాణహాని ఉండదని ఆమె హామీ ఇచ్చారు.
ఈ వార్త కూడా చదవండి: నడిరోడ్డుపై పోలీస్ వాహనంలో మంటలు