Saturday, November 23, 2024

Story : ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ బ‌తికేది రెండేళ్లేనా -క‌ల‌క‌లం రేపుతోన్న మేజర్ జనరల్ కైరీ బుడనోవ్ ప్రకటన

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధంతో విరుచుకుప‌డుతోంది. ఈ యుద్ధంలో ర‌ష్యా సైన్యం దెబ్బ‌కు ఉక్రెయిన్ లోని చాలా న‌గ‌రాలు నాశ‌న‌మ‌య్యాయి.కాగా ఈ నేపధ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ అనారోగ్యంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చాలాకాలంగా పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారనే ప్రచారం జ‌రుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రష్యా ..చైనా ఉత్తరకొరియా లాంటి కమ్యూనిస్టు దేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్తకూడా అంత తొందరగా రాదు.
అలాంటిది అధ్యక్షులు లేదా అధినేతల వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో వార్తలు వచ్చే అవకాశమే లేదు. అయితే పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. పుతిన్ అయితే ఒక రిసార్టులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం చేయించుకున్నారని పాశ్యాత్య మీడియా పదే పదే చెబుతోంది.

డైరెక్టుగా కాకపోయినా ఇన్ డైరెక్టుగానే పుతిన్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు రష్యన్ మీడియా కూడా సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగానే యుద్ధం సమయంలో కూడా పుతిన్ డైరెక్టుగా కనబడకుండా పరోక్షంగా తనకు అత్యంత సన్నిహితులు నమ్మకస్తులతోనే మొత్తం వ్యవహారాలను నడిపిస్తున్నారు. మాస్కోలో ఈమధ్యనే జరిగిన ఒక కార్యక్రమంలో ఎక్కువసేపు నిలబడలేక మధ్యలోనే వెళ్ళిపోయారు. దాంతోనే పుతిన్ అనారోగ్య సమస్య బాగా పెరిగిపోతున్నట్లు ప్రపంచానికి తెలిసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రెండేళ్ళకన్నా పుతిన్ బతకడంటూ ఉక్రెయిన్ మేజర్ జనరల్ తెలిపింది.ఈ మేర‌కు ఉక్రెయిన్ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ కైరీ బుడనోవ్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement