Sunday, November 24, 2024

National : బెంగాల్ ను వ‌ణికించిన తుపాన్..

అయిదుగురు మ‌ర‌ణం
500 మందికి పైగా గాయాలు
నిరాశ్ర‌యిలైన వేలాది మంది ప్ర‌జ‌లు
భారీగా ఆస్తి న‌ష్టం..
కూలిన ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్థంబాలు
జ‌ల దిగ్భంధంలో ప‌లు గ్రామాలు
కొన‌సాగుతున్న స‌హాయ కార్య‌క్ర‌మాలు
వర‌ద ప్రాంతాల‌లో సిఎం మ‌మ‌తా ప‌ర్య‌ట‌న

ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను, వర్షం కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ప్రధానంగా జల్‌పైగురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం సంభ‌వించింది..

- Advertisement -

ఈ తుఫాను ధాటికి అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో రాజర్‌హట్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత చెందగా, 500 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు.. వారంద‌రిని పున‌రావాస శిబిరాల‌కు త‌ర‌లించారు.

ఈ తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి. రాజర్‌హత్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాలు ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యుత్, టెలిపోన్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో అనేక గ్రామాలు,ప‌ట్ట‌ణాలు అంధ‌కారంలో చిక్కుకున్నాయి.

కాగా, వ‌ర‌ద బాధిత ప్రాంతాల‌లో బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నేడు ప‌ర్య‌టించారు.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.. ప్ర‌భుత్వం అన్ని విధాల ఆదుకుంటున్న‌ద‌ని వారికి హామీ ఇచ్చారు.. త‌క్ష‌ణ‌సాయం అంద‌జేయ‌వ‌ల‌సిందిగా అధికారుల‌ను ఆదేశించారు.

మోదీ విచారం…
అకాల వ‌ర‌ద‌ల‌కు అత‌కుతాలమైన బెంగాల్ ను ఆదుకుంటామ‌ని ప్ర‌ధాని మోదీ ఒక ప్ర‌క‌ట‌న‌లో హామీ ఇచ్చారు.. వ‌ర్షాల‌కు ఆయిదుగురు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాన మంత్రి స‌హాయ నిధి నుంచి కొంత మొత్తాన్ని అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు.. స‌హాయ కార్య‌క్ర‌మాల కోసం ఏ సాయం కావాల‌న్నా నేరుగా త‌న‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సిఎం మమ‌తా బెన‌ర్జీని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement