Friday, November 22, 2024

Breaking: బ్రిటన్​లో తుపాను బీభత్సం.. గాలివాన వేగానికి కొట్టుకుపోతున్న జనం.. (వీడియో)

యూకేలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. యూనిస్ తుఫాను బ్రిటన్​లోని దక్షిణాదిని ఆగమాగం చేస్తోంది. ఇంగ్లండ్‌లో ఎన్నడూ లేనంత బలమైన తుపానుగా దీన్ని పేర్కొంటున్నారు అధికారులు. గంటకు 196 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ బీభత్సం సృష్టిస్తున్నట్టు UK వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాను బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్ తో సహా ఇతర ఉత్తర యూరోపియన్ దేశాలను కూడా వణికిస్తోంది.

యూనిస్​ తుపాను బీభత్సంతో బ్రిటన్‌లో పదుల సంఖ్యలో వ్యక్తులు చనిపోయారు. దక్షిణ ఇంగ్లండ్‌లో కారు చెట్టును ఢీకొనడంతో ఒక వ్యక్తి, వాయువ్య ఇంగ్లాండ్‌లో శిధిలాల ద్వారా విండ్‌షీల్డ్ ను తాకి మరొక వ్యక్తి.. లండన్‌లో కారుపై చెట్టు పడడంతో 30 ఏళ్ల మహిళతో సహా మరొకరు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం అందినట్టు పోలీసులు చెప్పారు. నెదర్లాండ్స్ లో, ఆమ్‌స్టర్‌ డ్యామ్, చుట్టుపక్కల చెట్లు పడిపోవడం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు. నాలుగో వ్యక్తి ఉత్తర ప్రావిన్స్ గ్రోనింగెన్‌లో పడిపోయిన చెట్టుపైకి తన కారును నడుపుతూ చనిపోయాడు.

బెల్జియన్ పట్టణంలోని టోర్నైలో బలమైన గాలులు ఆసుపత్రి పైకప్పుపైకి దూసుకొచ్చాయి. ఇక్కడ ఎంతమంది చనిపోయారన్న విషయాలు మాత్రం తెలియలేదు. అయితే స్థానిక మీడియా పూర్తి వివరాలు ఇవ్వకుండా కొద్దిపాటి గాయాలయ్యాయనే ప్రచారం చేస్తోంది.  

బలమైన గాలుల మధ్య ఉత్తర పట్టణమైన యిప్రెస్‌లోని జలమార్గంలో మెరీనా వద్ద తన పడవ నుండి పడిపోయిన 79 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. ఐర్లాండ్‌లోని కౌంటీ వెక్స్ ఫోర్డ్ లో చెట్టు పడిపోయిన ఘటనలో స్థానిక ప్రభుత్వ ఉద్యోగి మరణించినట్లు స్థానిక కౌన్సిల్ తెలిపింది. యూనిస్ తుపాను ఈ వారం యూరప్‌ను తాకిన రెండో అతిపెద్ద తుఫాను. మొదటి తుఫాను జర్మనీ, పోలాండ్‌లో బీభత్సం సృష్టించింది. తూర్పు అట్లాంటిక్ మహాసముద్రంపై బలమైన జెట్ స్ట్రీమ్ కారణంగా తుపాను ప్రబలిందని, అందుకనే అధిక ఎత్తులో 321 kph వేగంతో గాలులు వీస్తున్నాయని ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లోని వాతావరణ శాస్త్రవేత్త పీటర్ ఇన్‌నెస్ చెప్పారు.

తుఫానుతో  ఇంగ్లాండ్, వేల్స్ లో ప్రయాణాలకు అంతరాయం కలిగింది. అనేక రైలు సేవలు నిలిపివేశారు. విమానాలు, ఫెర్రీ సేవలను కూడా రద్దు చేశారు.  కొన్ని బ్రిటీష్ విమానాశ్రయాల్లో గాలివానతో విమానాలు బలంగా నేలను తాకాయి. పైలట్‌లు ల్యాండింగ్‌లను వదిలివేయవలసి వచ్చింది.  వాతావరణ మార్పు ఐరోపాలో మరింత హింసాత్మక తుఫానులకు దారితీస్తోందని ఎటువంటి రుజువు లేదని ఇంపీరియల్ కాలేజీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రైడెరిక్ ఒట్టో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement