పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రేపటి (డిసెంబర్ 12) నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ ఫార్మాట్‌లో అనవసర సమయాన్ని అరికట్టి గేమ్‌ను మరింత జనరంజకంగా మార్చేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం నుంచి ‘స్టాప్ క్లాక్’ రూల్‌ను అమలులోకి తీసుకురానుంది.
వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మొదటి టీ20 మ్యాచుతోనే ఈ నూతన నిబంధన అమల్లోకి వస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తెలిపింది. దీని ప్రకారం.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫీల్డింగ్ జట్టు ఓవర్‌కు – ఓవర్‌కు మధ్య 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోరాదు. ఈ టైమ్‌లోగా ఫీల్డింగ్ జట్టు బౌలర్ మరుసటి ఓవర్‌ను మొదలు పెట్టాల్సి ఉంటుంది. మ్యాచులో రెండు సార్లు గనుక ఫీల్డింగ్ జట్టు ఈ టైమ్ తరువాత కూడా ఓవర్ ప్రారంభించడంలో విఫలం అయితే ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు.