Friday, November 22, 2024

విరిగిపడ్డ కొండచరియలు – ఇద్దరి దుర్మరణం

నాగాలాండ్లోని చమౌకేడిమా జిల్లాలో ఘోర ప్రమాదంజరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపైకి వేగంగా దూసుకొచ్చింది.దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.చమౌకేడిమా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిమాపూర్ నుంచి కోహిమా మధ్య 29వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో పకల్ పహర్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. అయితే భారీ వర్షాలకు పక్కనే ఉన్న ఎత్తయిన కొండపై నుంచి ఓ భారీ బండరాయి రోడ్డుపై ఉన్న వాహనాలపైకి దూసుకొచ్చింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. క్షణాల్లోనే మరో బండరాయి ఇంకో కారుపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలను ప్రమాదానికి గురైన కార్ల వెనుక ఉన్న మరో వాహనంలోని ఉన్న వీడియో తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement