హైదరాబాద్, ఆంధ్రప్రభ: చరిత్రపరిశోధనలో అద్భుతాలు జాలురాలు తున్నాయి. ప్రాచీన మానవుడి అడుగు జాడలతతో పాటుగా వేలాది సంవత్సరాల క్రితం ఊపిరిలభ్యం అవుతున్నాయి. తెలంగాణ చరిత్రకారుల బృందానికి హైదరాబాద్ కు 47 కిలో మీటర్ల దూరంలో రాతికొండపై విశాలంగా చెక్కిన పద్మవ్యూహం చిత్రం లభ్యమైంది. ఈ చిత్రం సుమారు 8వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చరిత్రకారుల పరిశోధనలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
మహాభారత యుద్ధంలోని పద్మవ్యూహం చిత్రాన్ని ఇది పోలిఉండటంతో చరిత్రకారులు మరింత మరిశోధనలు చేస్తున్నారు. ఐతరేయ బ్రహ్మణం మేరకు కురుక్షేత్ర యుద్ధంలో తెలుగువారు కౌరవుల పక్షాన పోరాడారు. ఈ నేపథ్యంలో ఇక్కడ లభించిన పద్మవ్యూహం (చక్రవ్యూహం) చిత్రానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారాం ప్రాచీన కాలం నాటి ఆదిమానవుల క్షేత్రమని ఇప్పకే అనేక ఆధారాలు లభ్యం అయినప్పటికీ అతిపెద్ద పద్మవ్యూహం రాతిచిత్రం లభ్యం కావడంతో చరిత్రకారులు పరిశోధనలపై దృష్టి సారించారు.
బొమ్మలరామారం మండలానికి చెందిన మాచన్ పల్లి రామునిగుట్టపై సహజ నీటి గుండం ఒడ్డున ఈ పద్మవ్యూహం చిత్రాన్ని చరిత్రకారులు కనుగొన్నారు. తెలంగాణ చరిత్రబృందం సభ్యులు మహ్మద్ నసీర్, అన్వర్, అహోబిలం కరుణాకర్, కొరివి గోపాల్ బృందం కన్వీనర్లు రామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్ , జమ్మన పల్లి రమేష్ ఈ ప్రదేశాన్ని పరిశీలించి జియోగ్రాఫిస్టుల అభిప్రాయాలు సేకరించి ఎనిమిది వేల సంవత్సరాల క్రితం నాటిదని నిర్ణయించారు.
ఈ లాంబ్రిత్ లను 17వ శాతాబ్దం నుంచి తాంత్రిక గ్రంథాల్లో చక్రవ్యూహాలు, పద్మవ్యూహాలుగా పేర్కొన్నారు. హళేబీడు దేవాలయం గోడలపై మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పాల్గొన్న పద్మవ్యూహం చెక్కబడింది. ఈ రాతి చెక్కుడు బొమ్మలో ఒకే ద్వారం ఉంది. అయితే మహాభారత యుద్ధంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పద్మవ్యూహం రాతిచిత్రం ఇక్కడ చెక్కడానికి కారణాలు, ప్రాచీన మానవుడి యుద్ధ నైపుణ్యతపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు అవకాశాలు ఏర్పడినవని చరిత్ర కారులు చెప్పారు.