Friday, November 22, 2024

Followup: నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. వరస లాభాలకు బ్రేక్‌

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో వరస లాభాలకు బ్రేక్‌ పడింది. వడ్డీ రేట్ల పెంపుపై బుధవారం రాత్రి అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఇంట్రాడేలో కనిష్టాలను నమోదు చేశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. దేశీయంగా రికార్డ్‌ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం, కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటం వల్ల స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలకు గురికాలేదు.

సెన్సెక్స్‌ 215.26 పాయింట్లు నష్టంతో 60906.09 వద్ద ముగిసింది. నిఫ్టీ 62.55 పాయింట్ల నష్టంతో 18082.85 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 112 రూపాయలు పెరిగి 50614 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 23 రూపాయలు పెరిగి 58869 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.62 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు
టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు
భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సిప్లా షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement