Saturday, November 23, 2024

ప్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌మార్కెట్లు సోమవారం నాడు ప్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తరువాత కొంత కోలుకున్నాయి. చివరకు ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. దేశీయంగానూ సోమవారం నాడు ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడించనున్న నేపథ్యంలో మదుపరులు జాగ్రత్త పడ్డారు. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ నష్టపోగా, నిఫ్టీ స్వల్ప లాభంతో ముగిసింది.
సెన్సెక్స్‌ 51.10 పాయింట్లు నష్టంతో 62,130.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 0.55 పాయింట్ల లాభంతో 18497.15 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 107 రూపాయలు తగ్గి 54188 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 116 తగ్గి 67922 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.32 రపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

- Advertisement -

టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ, విప్రో, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హీరో మోటోకార్ప్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ ఎం, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement