స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల అంశాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటి తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తరువాత కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. చివరకు లాభాల్లో మగిశాయి. సెన్సెక్స్ 361.01 పాయింట్ల లాభంతో 60927.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 117.70 పాయింట్ల లాభంతో 18132.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 176 రూపాయలు పెరిగి 54853 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 664 రూపాయలు పెరిగి 69739 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.79 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్; టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
హిందూస్థాన్ యూనిలీవర్, నెస్లీ, ఐటీసీ, ఎం అండ్ ఎం, ఎన్‌టీపీసీ, సిప్లా, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి.