Tuesday, November 26, 2024

లాభాల‌తో ముగిసిన – నేటి స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. చమురు ధరలు దిగి రావడం, వాహన విక్రయాలు పుంజుకోవడం, కమోడిటీ ధరలు తగ్గడం వంటివి ఇన్వెస్లర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానకి సెన్సెక్స్ 617 పాయింట్లు లాభపడి 53,751కి పెరిగింది. నిఫ్టీ 179 పాయింట్లు ఎగబాకి 15,990 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్ సర్వ్ (4.54%), బజాజ్ ఫైనాన్స్ (4.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (4.01%), మారుతి (3.48%), ఏసియన్ పెయింట్స్ (3.45%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.63%), ఎన్టీపీసీ (-1.03%), రిలయన్స్ (-0.87%), ఎల్ అండ్ టీ (-0.50%), టాటా స్టీల్ (-0.22%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement