Thursday, November 21, 2024

స్వల్పలాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. తగ్గిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు

ముంబాయి : స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వరసగా నాలుగు రోజులుగా మార్కెట్లు పాజిటీవ్‌గా స్పందిస్తున్నాయి. సూచీలు లాభాల్లో ముగుస్తున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, కోవిడ్‌ భయాల నేపధ్యంతొ కొరంటైన్‌ సమయాన్ని 14 రోజుల నుంచి 7 రోజులకు తగ్గిస్తున్నట్లు చైనా చేసిన ప్రకటన మార్కెట్‌లో సానుకూల ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు కొంతమేర తగ్గిపోయాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరల తగ్గుదల స్టాక్‌ మార్కెట్‌లో జోరు పెంచాయి. ప్రస్తుతం బేరల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 116.86 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

లాభపడిన షేర్లు..

బీఎస్సీ ఇండెక్స్‌లో 1794 షేర్లు లాభపడగా, 1482 షేర్లు నష్టపోయాయి. బీఎస్సీ 30 ఇండెక్స్‌లోని ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, నెస్లే, ఇన్ఫోసిన్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

టైటాన్‌, ఏషియన్‌ పేయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ల్యాండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రీడ్‌, భారతీ ఎయిర్‌ టెల్‌ షేర్లు నష్టపోయాయి. ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో అత్యధికంగా 8.35 శాతం నష్టపోయింది. ఈ సంస్థ షేరు 60.35 రూపాయిల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

- Advertisement -

బీఎస్సీ సెన్సెక్స్‌ 16.17 పాయింట్ల లాభంతో 53177.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.15 పాయింట్ల లాభంతో 15850.20 వద్ద ముగిసింది. 10 గ్రాముల బంగారం 215 పెరిగి 50864 రూపాయిలుగా ఉంది. వెండి కేజీ 237 పెరిగి 60183 రూపాయిలుగా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.17 రూపాయిలుగా ఉంది.

రూపాయి భారీ పతనం…

అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ తగ్గినప్పటికీ, అ రూపాయి పతనం మాత్రం ఆగడంలేదు. ప్రధానంగా స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరుతుండటంతో రూపాయి రోజు రోజుకు పతనం అవుతోంది. ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.53 రూపాయలతో ప్రారంభమైంది. ఒక దశలో 78.85కి పడిపోయింది. రూపాయిపై ప్రస్తుతం ఉన్న ఒత్తిడి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నందున ఈ వత్తిడి పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. దీని వల్లే గత ఆరు ట్రేడింగ్‌ సెషన్స్‌లో రూపాయి విలువ ఏకంగా 100 పైసలు తగ్గింది. డాలర్‌తో మారకం విలువ 79.20 నుంచి 80 రూపాయల వరకు చేరు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement