Wednesday, November 20, 2024

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఐదు రోజుల లాభాలకు బ్రేక్‌

స్టాక్‌మార్కెట్లపై బేర్‌ పంజా విసరడంతో సూచీలు మంగళవారం భారీగా నష్టపోయాయి. వరుసగా ఐదురోజులు లాభాలతో ఉన్న స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యా#హ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన పవనాలు, ఆసియా మార్కెట్లు డీలా పడటం వంటి కారణాలతో సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా పతనమైంది. అలాగే, వరుసగా 5 సెషన్లు లాభాలతో ముగియడంతో మదుపరులు తమ లాభాలను వెనక్కి తీసుకున్నారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలతోపాటు భారత్‌లో ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.07 శాతం పెరిగడం వల్ల సెన్సెక్స్‌ 709 పాయింట్లు తగ్గి 55,777 వద్ద స్థిరపడింది. నిప్టీn 208 పాయింట్లు క్షీణించి 16,663 వద్ద ముగిసింది. నిప్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 0.85 శాతం పడిపోయింది. ముగింపులో, సెన్సెక్స్‌ 709.17 పాయింట్లు 1.26శాతం క్షీణించి 55,776.85 వద్ద ఉంటే, నిప్టీn 208.30 పాయింట్లు 1.23 శాతం క్షీణించి 16,663 వద్ద స్థిరపడింది. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ నష్టాల్లో ముగిశాయి. నిప్టీn మెటల్‌ 4.07, నిప్టీn ఐటీ 2.58 శాతం తగ్గింది. నిప్టీ ఆటో0.57, నిప్టీ ఎఫ్‌ఎంసీజీ 0.17 శాతం చొప్పున పెరిగాయి.

టాటా స్టీల్‌ షేర్‌ ధర 5.24 శాతానికి పడిపోయి రూ. 1,229.05 చేరింది. హందాల్కో, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టాల్లో ఉన్నాయి. పేమెంట్స్‌ బ్యాంక్‌ కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా ఆర్బీఐ నిషేధించిన తర్వాత గత రెండు రోజుల్లో స్టాక్‌ దాదాపు 25 శాతం పడిపోయింది. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో టాటా స్టీల్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌ టాప్‌ లూజర్‌గా ఉన్నాయి. మారుతీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ లాభపడ్డాయి. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ ధర కూడా తగ్గుముఖం పట్టింది. బ్రెంట్‌ బ్యారల్‌ ధర 106 డాలర్లు, డబ్యూటీఐ బ్యారేల్‌ ధర 103 డాలర్లుగా ఉంది. 30 షేర్ల ఇండెక్స్‌లో టాటా స్టీల్‌, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, విప్రో, హీందాల్కో ఇండస్ట్రీస్‌ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్‌, సిప్లా, శ్రీ సిమెంట్స్‌, మారుతి సుజుకి షేర్లు రాణించాయి. ఆటో మినహా ఇతర అన్ని సెక్టార్‌ సూచీలు 14శాతం నష్టపోవడంతో మార్కెట్‌ భారీ నష్టాల్లో ముగిసింది. బిఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం నష్టపోయాయి.

దేశవాణిజ్యలోటు.. రూ.20.88 బిలియన్‌ డాలర్లు..

దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. వాణిజ్యలోటు 2022 ఫిబ్రవరిలో 20.88 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 13.12 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కాగా ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు 25.1 శాతం పెరిగి 34.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అదేవిధంగా దిగుమతులు 36 శాతం పెరిగి 55.45 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మొత్తంమీద ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 20.88 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ప్రకారం, మొత్తం దిగుమతుల్లో పెట్రోలియం, క్రూడ్‌ ఆయిల్‌ గతేడాదితో పోలిస్తే అత్యధికంగా 69 శాతం పెరిగి 15.28 బిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్హం. ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు 9.65 శాతం తగ్గి 4.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ దిగుమతులు 29.53 శాతం పెరిగి 6.27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఫార్మాఎగుమతుల విలువ 1.78 శాతం పడిపోయి 1.96 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 46.09 శాతం పెరిగి 374.81 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 59.33 శాతం పెరిగి 550.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

పేటీఎం షేర్లు పతనం..

- Advertisement -

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు భారీగా పతనమవుతోంది. బీఎస్‌ఈలో మార్చి 14న 13 శాతం వరకు క్షీణించిన పేటీఎం షేరు వ్యాల్యూ మంగళవారం 12.74 శాతం పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలోనే షేరు ఇష్యూ ధరలో 69 శాతం విలువ పడిపోయింది. 2021 నవంబరులో పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినప్పుడు ఇష్యూ ధర రూ.2,150 కాగా మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి రూ.589.30కి దిగివచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement