స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో ముగియడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే జోరు కొనసాగించాయి. దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు బలపడ్డాయి. చాలా రోజుల తరువాత ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలు సూచీలు లాభపడేందుకు దోహదం చేశాయి. స్టాక్ మార్కెట్ల లాభాలతో ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద 3 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 760.37 పాయింట్లు లాభపడి 54521.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 229.30 పాయింట్ల లాభంతో 16278.50 వద్ద ముగిసింది. 10 గ్రాముల బంగారం ధర 326 రూపాయిలు పెరిగి 50433 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 385 రూపాయిలు పెరిగి 55972 వద్ద ట్రేడ్ అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.74 రూపాయిలుగా ఉంది.
లాభపడిన షేర్లు..
ఇండస్‌ఇండ్ బ్యాం క్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హిండాల్కో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఉన్నాయి.
నష్టపోయిన షేర్లు..
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా, మహీంద్రా, మారుతి సుజుకీ, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనిలీవర్ షేర్లు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.